DET:FEB 10:
పెళ్లి వేడుకలో ప్రముఖుల సందడి:
చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు విజయ్ హాజరయ్యారు.తెల్లటి షర్ట్ ప్యాంట్ మరియు బేజ్ కలర్ బ్లేజర్ ధరించి చాలా స్టైలిష్‌గా కనిపించారు.ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా పాల్గొన్నారు.విజయ్ జగన్ పక్కపక్కనే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమానులతో సెల్ఫీలు:

వివాహ వేడుకలో విజయ్ ఎంతో హుందాగా వ్యవహరించారు.అతిథులను చిరునవ్వుతో పలకరించడమే కాకుండా తనను చూడగానే చుట్టుముట్టిన అభిమానులతో ఓపికగా ఫోటోలు దిగారు.రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విజయ్ తన అభిమానులతో ఇలా నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఈ వేడుకలో హీరోలు సూర్య కార్తీ కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

జన నాయగన్ వివాదం ఏమిటి?

హెచ్.వినోత్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్.నిజానికి ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది.అయితే సెన్సార్ బోర్డ్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో విడుదల వాయిదా పడింది.ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల పట్ల సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

రాజకీయాల్లో విజయ్ అడుగులు:

తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.అందుకే ఈ జన నాయగన్ సినిమా ఆయన కెరీర్‌లో చాలా కీలకంగా మారింది.సినిమా విడుదల ఆలస్యమవుతున్నా విజయ్ మాత్రం ప్రజా సంబంధాలను పెంచుకుంటూ తన రాజకీయ పంథాలో ముందుకు సాగుతున్నారు.జగన్ స్టాలిన్ వంటి అగ్ర నాయకులతో ఆయన ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.