DET:FEB 09:
ప్రేమ ప్రయాణం మరియు అధికారిక ప్రకటన:
కృతికా కమ్రా,గౌరవ్ కపూర్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేశాయి.అయితే డిసెంబర్ 2025లో కృతిక తన సోషల్ మీడియాలో గౌరవ్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తమ బంధాన్ని అధికారికంగా ధృవీకరించారు.అప్పటి నుండి వీరిద్దరూ కలిసి విహారయాత్రలకు వెళ్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.ముఖ్యంగా జైసల్మేర్‌లో వీరు జరుపుకున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ముంబైలో వివాహ వేడుకలు:

తాజా సమాచారం ప్రకారం వీరి వివాహం ముంబైలో అత్యంత వైభవంగా జరగనుంది.కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించాలని వీరు భావిస్తున్నారు.ముంబైలోనే పెళ్లి పనులు కూడా అప్పుడే మొదలైనట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీకి సంబంధించి వీరిద్దరి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

సినీ పరిశ్రమ కోసం ప్రత్యేక రిసెప్షన్:

పెళ్లి వేడుకను కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ చిత్ర పరిశ్రమలోని స్నేహితులు మరియు సహోద్యోగుల కోసం ముంబైలో ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ మరియు టెలివిజన్ రంగానికి చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

గౌరవ్ కపూర్ మరియు కృతికల కెరీర్:

గౌరవ్ కపూర్ ఐపీఎల్ హోస్ట్‌గా అలాగే బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.ఇది గౌరవ్‌కు రెండవ వివాహం ఆయన గతంలో కిరాట్ భట్టల్‌ను వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు.మరోవైపు కృతికా కమ్రా కితనీ మొహబ్బత్ హై వంటి సీరియల్స్‌తో పాటు తాండవ్,గియార్ హుమాయూన్ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు.