
DNews: Feb05: నైజీరియాలోని క్వారా రాష్ట్రంలోని వోరో మరియు నుకా అనే రెండు గ్రామాలోకి ఉగ్రవాదులు అకస్మాత్తుగా ప్రవేశించి ప్రజలను చుట్టుముట్టారు. ఉగ్రవాదులు గ్రామస్తుల చేతులను వెనుకకు కట్టి, ఆపై వారిని కాల్చి చంపారు. ఈ దాడిలో దాదాపు 200 మంది మరణించారని భావిస్తున్నారు. హత్యలతో పాటు, గ్రామాల్లోని ఇళ్ళు మరియు దుకాణాలకు కూడా నిప్పు పెట్టారు. కొంతమంది ప్రాణ భయంతో అడవుల్లోకి పరిగెత్తారు. వీధుల్లో ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది.
గత ఐదు నెలలుగా ఉగ్రవాదులు గ్రామస్తులకు బెదిరింపు లేఖలు పంపుతున్నారని, అయితే ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నైజీరియా సైన్యం జరిపిన ఆపరేషన్‌లో సుమారు 150 మంది ఉగ్రవాదులు మరణించారు.ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ మారణహోమం చేసి ఉండవచ్చని క్వారా గవర్నర్ అబ్దుల్‌రెహ్మాన్ అన్నారు. కట్సినా రాష్ట్రంలో కూడా బందిపోట్లు విధ్వంసం సృష్టించారు, అక్కడ జరిగిన దాడిలో మరో 21 మంది మరణించారు. ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.
