
DSports 02Feb 2026:ఇటీవల ఒక ప్రముఖ టాక్ షో (‘ఆప్ కీ అదాలత్’)లో పాల్గొన్న మేరీ కోమ్, తన వ్యక్తిగత జీవితం మరియు మాజీ భర్త కె. ఓన్లెర్ కోమ్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె తాజాగా స్పందించారు.
- టాక్ షోలో మేరీ కోమ్ మాట్లాడుతూ.. తన మాజీ భర్త “ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు” (Ek rupiya bhi nahi kamaya) అని, తన సంపాదనతోనే అతను విలాసవంతమైన జీవితం గడిపారని ఆరోపించారు. అంతేకాకుండా, అతను ఆడే ఫుట్‌బాల్‌ను ‘గల్లీ ఫుట్‌బాల్’ అని సంబోధిస్తూ, “అలా ఆడితే సునీల్ ఛెత్రి, బైచుంగ్ భూటియా కాలేరు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని, ఫుట్‌బాల్ క్రీడాకారుల కష్టాన్ని తక్కువ చేశాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
