
D Spiritual: Feb 2: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్ కుమార్ సింఘాల్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు తితిదే ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అనిల్ కుమార్ సింఘాల్‌ను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఈ నిర్ణయం తిరుమల పరిపాలనా వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకు దారి తీసింది. అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా, ఆయనను అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
