DNews: Jan 31: తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి 21 వరకు రెండు స్పెల్లులుగా నిర్వహించబడతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,440 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 2,74,007 MPC విద్యార్థులు, 1,33,415 BiPC విద్యార్థులు, 1,18,770 వృత్తి విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 7,559 మంది అధికారులను నియమించారు. ల్యాబ్ పరికరాలు, సాధనాలు సిద్ధంగా ఉంచారు. గతంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రాక్టికల్ పరీక్షల పర్యవేక్షణ కోసం 7,599 మందిని నియమించారు. వారికి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. హాల్ టికెట్లు విద్యార్థులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో అమలు చేస్తున్న జంబుల్ సిస్టమ్‌ను ప్రైవేట్ కళాశాలల్లో కూడా అమలు చేయనున్నారు. ప్రభుత్వ లెక్చరర్లు ఫ్లయింగ్ స్క్వాడ్లుగా పంపబడతారు. మొత్తం 7,559 మంది ఇన్విజిలేటర్లలో 4,000 మంది ప్రభుత్వ లెక్చరర్లు కాగా, 34 శాతం ప్రభుత్వ లెక్చరర్లు, 66 శాతం ప్రైవేట్ లెక్చరర్లు పర్యవేక్షణలో పాల్గొంటారు. ఈ నిర్ణయం పారదర్శకత కోసం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు కనీసం 12 మార్కులు పొందాలి. గతంలో విఫలమైన 400 మంది బ్యాక్‌లాగ్ విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకానున్నారు. సుమారు 10 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు, 60 వేల మంది బ్యాక్‌లాగ్ విద్యార్థులు IPE పరీక్షలు రాయనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎటువంటి ఆలస్యం లేకుండా పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana