
DSports 31Jan 2026:తిరువనంతపురం: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ క్రేజ్ చూసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ముచ్చటేసింది. న్యూజిలాండ్‌తో ఐదో టీ20 ఆడేందుకు భారత జట్టు కేరళ చేరుకోగా, ఎయిర్‌పోర్టులో సంజును చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో కెప్టెన్ సూర్య చేసిన అల్లరి అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
- ఎయిర్పోర్ట్ నుంచి టీమ్ బస్సు వైపు నడుస్తున్న సమయంలో, సూర్యకుమార్ యాదవ్ ఒక్కసారిగా సంజు శాంసన్‌కు బాడీగార్డ్‌లా మారిపోయాడు.సంజు ముందు నడుస్తూ, అక్కడున్న కెమెరామెన్లను, సిబ్బందిని ఉద్దేశించి.. “ప్లీజ్ గివ్ వే.. డోంట్ డిస్టర్బ్ చెట్టా (మలయాళంలో అన్న అని అర్థం).. పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు” అంటూ సెక్యూరిటీ గార్డ్‌లా మేనరిజమ్స్ చేశాడు.తన కెప్టెన్ చేస్తున్న ఈ సరదా పని చూసి సంజు శాంసన్ ఒక్కసారిగా నవ్వేశాడు. పక్కనే ఉన్న ఇతర ఆటగాళ్లు కూడా ఈ సన్నివేశాన్ని చూసి ఎంజాయ్ చేశారు.అంతకుముందు విమానం దిగగానే సూర్య సంజుతో మాట్లాడుతూ.. “గాడ్స్ ఓన్ కంట్రీకి స్వాగతం” అని చెప్పగా, సంజు “ఫీలింగ్ గ్రేట్” అని బదులిచ్చాడు.
బీసీసీఐ (BCCI) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ సాధించింది. “కేరళలో సంజు క్రేజ్ చూసి కెప్టెనే ఫిదా అయిపోయాడు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
