
DNews: Jan28:కూటమి ప్రభుత్వాన్ని సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరాం రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కోడిని చంపినా కేసులు పెట్టవచ్చని, ఈ తరహా పాలనతో కూటమి నాశనమవుతుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి చాలా సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో పరిస్థితి మారలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని విమర్శించారు. అమరావతిలో ఏదో జరుగుతోందని ప్రచారం చేస్తున్నారని, కోట్లాది రూపాయలు అప్పు చేసి రాజధాని నిర్మిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తిరిగి ఇవ్వదగిన ప్లాట్ల సమస్య ఇప్పటికీ భరించలేనిదిగా ఉందని అన్నారు. రాజధాని రెండవ దశ కోసం 1.75 లక్షల ఎకరాలు డిమాండ్ చేయడం ద్వారా ఎవరి భూములను నాశనం చేయాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
