
DNews: Jan28: రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఒక మహిళ చేసిన ఆరోపణల నేపథ్యంలో, దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఇందులో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ ఉన్నారు.
మీడియాలో వచ్చిన వార్తలపై దర్యాప్తు చేయాలని పార్టీ కమిటీని ఆదేశించింది. ఏడు రోజుల్లోగా ఎమ్మెల్యే శ్రీధర్ ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తారని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక వెలువడే వరకు ఎమ్మెల్యే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
