DSports 28Jan 2026: భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026లో ఆడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న స్కాట్లాండ్, తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ ఆ స్థానాన్ని ప్రస్తుత ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్‌కు కేటాయించింది.

  • ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన జట్టుకు అనుభవజ్ఞుడైన రిచీ బెరింగ్టన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 2024 వరల్డ్ కప్‌లో ఆడిన జట్టులోని 11 మంది ఆటగాళ్లకు ఈసారి కూడా అవకాశం కల్పించడం విశేషం. జట్టును మరింత బలోపేతం చేసేందుకు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టామ్ బ్రూస్ను ఎంపిక చేశారు. 34 ఏళ్ల బ్రూస్ గతంలో కివీస్ తరపున 17 టీ20లు ఆడారు.
  • అఫ్గానిస్తాన్‌లో జన్మించిన ఫాస్ట్ బౌలర్ జైనుల్లా ఇహ్సాన్ తొలిసారి అంతర్జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే ఒలివర్ డేవిడ్సన్, ఫిన్లే మెక్‌క్రీత్‌లు తమ మొదటి ప్రపంచకప్ ఆడనున్నారు.గాయాల వంటి అత్యవసర పరిస్థితుల కోసం ఇద్దరు ట్రావెలింగ్ రిజర్వ్‌లను (జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్), మరో ముగ్గురు నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లను ఎంపిక చేశారు.బ్యాటింగ్ విభాగంలో జార్జ్ మున్సీ, మైకేల్ లీస్క్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ప్రత్యర్థులకు సవాల్ విసరనున్నారు.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana