DSports 28Jan 2026:న్యూఢిల్లీ/లాహోర్: భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆ జట్టుకే ముప్పుగా మారేలా కనిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ టోర్నీ నుంచి తప్పించడంతో, దానికి నిరసనగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామంటూ పాక్ కొత్త పల్లవి అందుకుంది.

  • భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రతా ముప్పు ఉందని బంగ్లాదేశ్ చేసిన వాదనను ఐసీసీ కొట్టిపారేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకున్నారు. అయితే, బంగ్లాకు సంఘీభావంగా తాము కూడా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంటామని లేదా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ బెదిరింపులకు దిగుతోంది.
  • పాకిస్థాన్ తీరుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిందిభారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే బ్రాడ్‌కాస్టర్ల ద్వారా వచ్చే సుమారు 38 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 300 కోట్లు) నష్టాన్ని పీసీబీయే భరించాల్సి ఉంటుంది.ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పాకిస్థాన్‌పై అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే తప్పుకుంటే, వారి స్థానంలో తిరిగి బంగ్లాదేశ్‌ను గ్రూప్-ఏలో చేర్చి, వారి మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహించాలని ఐసీసీ యోచిస్తోంది.
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana