Breaking: Plane crashes.. Maharashtra Deputy Chief Minister Ajit Pawar burnt alive

DNews: Jan28: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎన్‌సిపి నాయకుడు, డిప్యూటీ సిఎం అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయి పేలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఐదుగురు వ్యక్తులు మరణించారని పౌర విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ అధికారికంగా ప్రకటించింది.

బుధవారం ఉదయం అజిత్ పవార్ తన నియోజకవర్గం బారామతిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే, విమానం కొన్ని క్షణాల్లోనే ల్యాండ్ కావాల్సి ఉండగా, అది అనుకోకుండా కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటల్లో చిక్కుకుంది. విమానంలో ఉన్న వారందరూ సజీవ దహనమయ్యారు.

ఉదయం 8.45 గంటలకు విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో, అజిత్ పవార్‌తో పాటు ఆయన పిఎ, సెక్యూరిటీ గార్డు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఆయన జెడ్‌పి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కూలిపోయిన విమానం బాంబార్డియర్ లియర్‌జెట్ 45 (కెనడా) అని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా ధ్వంసమైంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana