
DET:JAN 27:
తెలుగు సినిమా భవిష్యత్తు అని ప్రశంస:
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవల బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడికి ఒక ఖరీదైన లగ్జరీ కారును కానుకగా అందించారు.ఈ సందర్భంగా చిరంజీవి గారు అనిల్ రావిపూడిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అనిల్ కేవలం కమర్షియల్ దర్శకుడు మాత్రమే కాదని ప్రేక్షకులకు ఏం కావాలో తెలిసిన మేధావి అని కొనియాడారు.అనిల్ రావిపూడి తెలుగు సినిమా భవిష్యత్తు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో జోష్ నింపాయి. అనిల్ మేకింగ్ స్టైల్ మరియు కామెడీ టైమింగ్‌పై చిరంజీవి గారికి ఉన్న గురి ఈ బహుమతి ద్వారా స్పష్టమైంది.
మన శంకర వరప్రసాద్ పై అంచనాలు:
చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.తన పేరునే టైటిల్‌గా పెట్టి తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో మెగాస్టార్‌ను అనిల్ రావిపూడి సరికొత్త మాస్ మరియు వినోదాత్మక కోణంలో చూపించబోతున్నారని సమాచారం.దర్శకుడి విజన్ నచ్చడం వల్లే చిరంజీవి గారు షూటింగ్ దశలోనే ఈ స్థాయిలో ప్రోత్సహిస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆనందంలో దర్శకుడు అనిల్ రావిపూడి:
మెగాస్టార్ చేతుల మీదుగా ఇలాంటి అపురూపమైన బహుమతిని అందుకోవడం పట్ల అనిల్ రావిపూడి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన ఆరాధ్య దైవం నుండి ప్రశంసలు అందుకోవడం తన కెరీర్లో దక్కిన అతిపెద్ద గౌరవంగా ఆయన పేర్కొన్నారు.ఈ ప్రోత్సాహం సినిమాపై మరింత బాధ్యతను పెంచిందని ప్రేక్షకులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
