DET:JAN 24:
మూడేళ్ల తర్వాత మళ్ళీ ఖాకీ డ్రెస్సులో లాల్ సెట్టన్:
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మోహన్‌లాల్ సుమారు మూడేళ్ల విరామం తర్వాత మళ్ళీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఆయన చివరిగా 2021లో వచ్చిన ఆరాట్టు సినిమాలో పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పటికీ పూర్తిస్థాయి ఇన్వెస్టిగేటివ్ కాప్ రోల్ చేసి చాలా కాలమైంది.ఇప్పుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆయన అభిమానులకు పవర్‌ఫుల్ పోలీస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

సామాన్యుల కథతో తరుణ్ మూర్తి మ్యాజిక్:
ఆపరేషన్ జావా,సౌదీ వెల్లాక్క వంటి వైవిధ్యమైన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తరుణ్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఇది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా సామాన్యుల జీవితాలకు దగ్గరగా ఉండే కథ అని తెలుస్తోంది.మోహన్‌లాల్ ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని కథనం చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ సమాచారం ఇస్తోంది.

శోభన మరియు మోహన్‌లాల్ క్రేజీ కాంబినేషన్:

ఈ సినిమాకు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే సీనియర్ నటి శోభన చాల కాలం తర్వాత మోహన్‌లాల్‌తో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరిది వెండితెరపై ఒక క్లాసిక్ జోడీ.దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో హుందాగా ఆసక్తికరంగా ఉంటాయని టాక్.

భారీ నిర్మాణ విలువలతో L366:

ప్రముఖ నిర్మాణ సంస్థ రజపుత్ర విజువల్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది.ఇప్పటికే చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మలయాళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.మోహన్‌లాల్ కెరీర్‌లో ఈ 366వ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా టైటిల్ మరియు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.