
DNews: Jan 24: హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. జాగృతి నాయకులు జిల్లా పరిషత్, మండల పరిషత్‌తో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీతో చర్చలు పూర్తి చేసి, ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన చర్చల్లో జాగృతి మరియు AIFB మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే కొత్త రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. అయితే ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి మరో రెండు నుండి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా. ఈలోపు రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో AIFB సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి నాయకత్వం నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
