
DNews: Jan 24: హైదరాబాద్ నగరంలో మల్కాజిగిరి డీసీపీ చి. శ్రీధర్ గారు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ వాహనాలను ఎగరడం నిషేధించారు. ఈ నిషేధం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమల్లో ఉంటుంది. బేగంపేట్, మార్కెట్, మరేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఆదేశాలను ఉల్లంఘించి డ్రోన్లు ఎగరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
