DSports 23Jan 2026:న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి పాలైన నేపథ్యంలో, టీమిండియా వన్డే కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఘాటుగా స్పందించారు. అద్భుతమైన ఫామ్‌లో ఉండి, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025) గెలిపించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని ఆయన ప్రశ్నించారు.

  • రోహిత్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు వన్డే సిరీస్‌లలో (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) విఫలమయ్యాడు. దీనిపై తివారీ స్పందిస్తూ.. “గిల్‌ను కెప్టెన్ చేసి టీమ్ మేనేజ్మెంట్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. అతనిపై కెప్టెన్సీ భారం వల్ల బ్యాటింగ్ కూడా దెబ్బతింటోంది. 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలి” అని పేర్కొన్నారు.
  • రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పాత్ర ఉందని తివారీ ఆరోపించారు.”రోహిత్ విఫలం కావాలని కొందరు కోరుకుంటున్నారు. అతనిలో ఇంకా చాలా క్రికెట్ ఉంది.””రోహిత్ కెప్టెన్సీలో ఉంటే వరల్డ్ కప్ గెలిచే అవకాశం 90 శాతం ఉంటుంది.””మూడు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడి సామర్థ్యాన్ని శంకించడం అవమానకరం.”
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana