DNews: Jan 23: దక్షిణ మధ్య రైల్వే శాఖ సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మెదారం జాతర ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, మంచిర్యాల్, సిరిపూర్ కాగజ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల నుండి వరంగల్, కాజీపేట వరకు నడుస్తాయి. ఈ రైళ్లు పూర్తిగా అనారక్షిత సాధారణ రైళ్లు కావున భక్తులు వీటిని వినియోగించుకోవాలని రైల్వే ప్రజాసంబంధాల అధికారి ఏ. శ్రీధర్ తెలిపారు. రైళ్లు ఆయా మార్గాల్లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయి.
సికింద్రాబాద్-మంచిర్యాల్-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07495/07496) జనవరి 28, 30 మరియు ఫిబ్రవరి 1న నడుస్తాయి. ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి, 8.45కి కాజీపేట చేరుకొని, మధ్యాహ్నం 1.30కి మంచిర్యాల్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మంచిర్యాల్ నుండి మధ్యాహ్నం 3.30కి బయలుదేరి, రాత్రి 10.10కి సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్-సిరిపూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (07497/07498) జనవరి 29 మరియు 31న నడుస్తాయి. ఉదయం 5.45కి సికింద్రాబాద్ నుండి బయలుదేరి, 8.45కి కాజీపేట చేరుకొని, మధ్యాహ్నం 2 గంటలకు సిరిపూర్ కాగజ్‌నగర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.30కి బయలుదేరి, రాత్రి 10.10కి సికింద్రాబాద్ చేరుతుంది.
నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ ప్రత్యేక రైళ్లు (07498/07499) జనవరి 28 నుండి 31 వరకు నడుస్తాయి. ఉదయం 7.05కి నిజామాబాద్ నుండి బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.40కి వరంగల్ నుండి బయలుదేరి, రాత్రి 10.30కి నిజామాబాద్ చేరుతుంది.
ఖమ్మం-కాజీపేట-ఖమ్మం ప్రత్యేక రైళ్లు (07503/07504) జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు నడుస్తాయి. ఉదయం 10 గంటలకు ఖమ్మం నుండి బయలుదేరి, మధ్యాహ్నం 12.50కి కాజీపేట చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేట నుండి బయలుదేరి, సాయంత్రం 5.30కి ఖమ్మం చేరుతుంది.
ఆదిలాబాద్-కాజీపేట-ఆదిలాబాద్ ప్రత్యేక రైళ్లు (07501/07502) జనవరి 28 రాత్రి 11.30కి ఆదిలాబాద్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45కి కాజీపేట చేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 29 మధ్యాహ్నం 1.15కి కాజీపేట నుండి బయలుదేరి, జనవరి 30 ఉదయం 4 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana