
DNews: Jan23: రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు అమరావతి ప్రాంత రైతులకు ప్లాట్లు కేటాయించనున్నారు. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ వ్యవస్థ ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ విషయంలో సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ జరగనుంది.
అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు కేటాయించనున్నారు. అక్కడ 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి రైతుల కోసం ఈ-లాటరీ జరగనుంది. మరోవైపు, ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు, భవిష్యత్తు అవసరాలు మరియు విస్తరణ కోసం ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తోంది. ఈ సందర్భంలో, రైతులకు ప్లాట్ల కేటాయింపు అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా పరిగణించబడుతుంది.
