
D News : నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా థియేటర్లలోకి రాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. చెన్నైలో ప్రీమియర్ షోలు, డే-1 అడ్వాన్స్ సేల్స్ కలిపి ఇప్పటికే రూ.కోటి గ్రాస్ మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. ఇది నాని సినిమాల్లో అత్యధిక అడ్వాన్స్ సేల్స్‌లో ఒకటిగా నిలిచిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోనూ ‘ది ప్యారడైజ్’ టికెట్లకు డిమాండ్ కనిపిస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే పలు మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో మాస్ ఇమేజ్‌ను పెంచుకున్న నాని.. ‘ది ప్యారడైజ్’లో జడల్ అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల టేకింగ్, నాని కొత్త లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ప్రీ-సేల్స్‌కు మంచి స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ స్థాయి స్పందన కనిపిస్తుండటంతో.. సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
