DSports 23Jan 2026:వెల్లింగ్టన్: ప్రపంచకప్ సమరానికి సిద్ధమవుతున్న వేళ న్యూజిలాండ్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు ప్రధాన బౌలర్ ఆడమ్ మిల్నే ఎడమ కాలి హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో మిల్నే ఈ గాయానికి గురయ్యాడు.

  • ఆడమ్ మిల్నే స్థానంలో పొడవైన పేసర్ కైల్ జేమిసన్‌ను ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. జేమిసన్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నాడు. తొలుత అతడిని ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేసినప్పటికీ, మిల్నే దూరం కావడంతో ఇప్పుడు ప్రధాన జట్టులో చోటు దక్కింది.
  • మిల్నే దూరం కావడంపై కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ స్పందిస్తూ.. “ఆడమ్ కోసం మేము చాలా బాధపడుతున్నాం. ఈ టోర్నీ కోసం అతను చాలా కష్టపడ్డాడు. SA20లో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో గాయపడటం దురదృష్టకరం. అయితే కైల్ జేమిసన్ ఇప్పటికే భారత్‌లో ఉండి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం మాకు కలిసివచ్చే అంశం” అని పేర్కొన్నారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana