DSports 22Jan 2026:ఢాకా: టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలన్న డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి జరిగిన అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐసీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని తాము ఇప్పటికీ ఆశిస్తున్నామని తెలిపారు.

  • “ఐసీసీ తన పంతాన్ని వీడి, మా విన్నపాన్ని మళ్లీ పరిశీలిస్తుందని.. ఏదో ఒక అద్భుతం (Miracle) జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచకప్‌లో ఆడాలని ఎవరికి ఉండదు? మా ఆటగాళ్లు, మా ప్రభుత్వం అందరూ వరల్డ్ కప్ ఆడాలనే కోరుకుంటున్నారు.””కానీ మాకు ఆటగాళ్ల భద్రత అత్యంత ప్రధానం. ప్రస్తుత పరిస్థితుల్లో మా ఆటగాళ్లను భారత్‌కు పంపడం సురక్షితం కాదని మేము భావిస్తున్నాము. అందుకే శ్రీలంకలో ఆడతామని అడిగాము.””ఐసీసీ నిర్ణయం తర్వాత, నేను బోర్డు సభ్యులను ఒక్కటే కోరాను. మా ప్రభుత్వంతో మరోసారి చర్చించడానికి నాకు 24 గంటల సమయం ఇవ్వమని అడిగాను. ప్రభుత్వం నుంచి వచ్చే తుది అభిప్రాయాన్ని బట్టి మా నిర్ణయం ఐసీసీకి వివరిస్తాం.”
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana