
SDports 22Jan 2026:దుబాయ్/ఢాకా: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్-2026 వేదికల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదంటూ, మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని పట్టుబడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అభ్యర్థనను ఐసీసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడటం ఇష్టం లేకపోతే టోర్నీ నుంచి తప్పుకోవచ్చని, వారి స్థానంలో మరో జట్టును తీసుకుంటామని గట్టి హెచ్చరిక జారీ చేసింది.
- బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.స్వతంత్ర భద్రతా సంస్థలు సమర్పించిన నివేదిక ప్రకారం.. భారత్‌లోని అన్ని వేదికల వద్ద ఆటగాళ్లకు, అధికారులకు ఎలాంటి ప్రాణహాని లేదని ఐసీసీ ధృవీకరించింది.టోర్నీ ప్రారంభానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్నందున, షెడ్యూల్‌ను మార్చడం అసాధ్యమని స్పష్టం చేసింది.కేవలం ఐపీఎల్ నుంచి ఒక బంగ్లా ప్లేయర్‌ను తొలగించిన అంశాన్ని, భద్రతతో ముడిపెట్టడం సరికాదని ఐసీసీ బంగ్లాదేశ్‌కు చురకలంటించింది.
