SDports 22Jan 2026:మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్-2026’లో అగ్రశ్రేణి క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో టాప్ సీడ్లు ఆర్యనా సబలెంక, కార్లోస్ అల్కారజ్ తమ ప్రత్యర్థులను చిత్తు చేసి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. వీరితో పాటు కోకో గాఫ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా వరుస విజయాలతో సత్తా చాటారు.

  • మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 1 ఆర్యనా సబలెంక తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. చైనా క్రీడాకారిణి బాయి జువోక్సువాన్‌పై కేవలం 1 గంట 16 నిమిషాల్లోనే 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా, రెండో సెట్‌లో సబలెంక తన పవర్‌ఫుల్ సర్వీస్‌లతో బాయిని ఉక్కిరిబిక్కిరి చేసింది.
  • పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కారజ్ కఠినమైన సవాలును అధిగమించాడు. జర్మనీకి చెందిన యానిక్ హాన్‌ఫ్‌మన్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్కారజ్ 7-6 (7-4), 6-3, 6-2 తేడాతో గెలుపొందాడు. తొలి సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లినా, ఒత్తిడిని అధిగమించిన అల్కారజ్ వరుసగా మూడు సెట్లను గెలుచుకుని తన కెరీర్ గ్రాండ్‌స్లామ్ వేటలో మరో అడుగు ముందుకు వేశాడు.