
DNews: Jan12:ఏపీ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి షిర్డీలో సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబాకు నిర్వహించిన కాగడ ఆరతి, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. మంత్రి లోకేష్, ఆయన భార్యను ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు స్వాగతించి దుశ్శాలువతో సత్కరించారు. హారతి అనంతరం వారికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మంత్రి లోకేష్ వెంట ఎమ్మెల్యే పులివర్తి నాని, తదితరులు ఉన్నారు.
