DSports Jan10 2026:న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న సమయంలో తిలక్ వర్మ పొత్తికడుపు గాయానికి గురయ్యారు. దీనివల్ల ఆయనకు అత్యవసరంగా సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. ఫలితంగా కివీస్‌తో జరిగే తొలి మూడు టీ20లకు ఆయన దూరం కాగా, ప్రపంచకప్ ఆడే విషయంపై కూడా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో తిలక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపిక అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు.

  • “తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడతారు. కాబట్టి భారత్‌కు ఇప్పుడు ఓపెనర్ అవసరం లేదు. నంబర్ 3 లేదా 4 స్థానాల్లో ఆడగలిగే అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. అందుకు శ్రేయస్ అయ్యర్ లేదా ‘సర్పాంచ్’ (అయ్యర్‌ను అభిమానులు పిలుచుకునే పేరు) సరైన వ్యక్తి. అతడిని నేరుగా జట్టులోకి తీసుకోవచ్చు” అని పేర్కొన్నారు.
  • అయ్యర్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడుతున్నాడని, ఐపీఎల్‌లో కూడా మంచి ప్రదర్శన చేసిన అనుభవం అతనికి ఉందని గుర్తు చేశారు.
  • గతంలో ఆసియా కప్‌కు అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం కొంత బాధ కలిగించిందని, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసే అవకాశం వచ్చిందని చోప్రా తెలిపారు.