
DSports Jan10 2026:కౌలాలంపూర్: సుదీర్ఘ విరామం తర్వాత కోర్టులోకి అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన సింధు, సెమీఫైనల్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 అనే వరుస సెట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.తొలి సెట్‌లో ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒక దశలో స్కోరు 14-14తో సమంగా ఉన్నప్పటికీ, కీలక సమయంలో సింధు చేసిన అనవసర తప్పిదాలను చైనా ప్లేయర్ అందిపుచ్చుకుని సెట్‌ను కైవసం చేసుకున్నారు.రెండో గేమ్‌లోనూ సింధు అద్భుతమైన షాట్లతో పుంజుకునే ప్రయత్నం చేశారు. 13-13 వద్ద స్కోరు సమం చేసినా, వాంగ్ జి యి తన వేగవంతమైన స్మాష్‌లు, క్రాస్ కోర్ట్ షాట్లతో సింధుపై ఒత్తిడి పెంచి విజయాన్ని అందుకున్నారు.
