DNews: Jan6: ఎయిర్ ఇండియా ప్రస్తుత CEO కాంప్‌బెల్ విల్సన్‌కు టాటాలు ‘టాటా’ చెప్తారా? టాటా గ్రూప్ బాస్‌లు ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారా? ఆంగ్ల మీడియా నివేదికలు అవును అని చెబుతున్నాయి. టాటాసన్స్ త్వరలో విల్సన్‌ను తొలగించి, ఆయన స్థానంలో మరొక వ్యక్తిని CEOగా నియమించాలని ఆలోచిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ విషయంలో ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థల సీనియర్ నాయకులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా US మరియు UKలోని రెండు ప్రముఖ విమానయాన సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడారని నివేదిక పేర్కొంది. వృద్ధి పరంగా ఎయిర్‌లైన్ పనితీరు లేకపోవడంతో చంద్రశేఖరన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే విల్సన్‌ను భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదనంగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ CEOగా ఉన్న అలోక్ సింగ్‌ను భర్తీ చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా CEO విల్సన్ పదవీకాలం జూన్ 2027లో ముగియగా, అలోక్ సింగ్ పదవీకాలం కూడా 2027లో ముగుస్తుంది.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana