
DSports Jan6 2026:రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీ 2026 సీజన్‌లో హైదరాబాద్ యువ సంచలనం అమన్ రావు పేరాల (Aman Rao Perala) చరిత్ర సృష్టించాడు. మంగళవారం బెంగాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అమన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం తన మూడవ లిస్ట్-ఏ మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని అందుకుని, దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త స్టార్‌గా అవతరించాడు.ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ తెలుగు కుర్రాడిని రూ. 30 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అమన్ ఇలాంటి భారీ ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్స్ యాజమాన్యం పండగ చేసుకుంటోంది. అమెరికాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగిన ఈ 21 ఏళ్ల యువకుడు, భవిష్యత్తులో భారత జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
