
DNews: Jan 05: మహబూబాబాద్ జిల్లా మారిపెడ మండలంలోని తలుక్కల్లు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్లం నవీన్ తన భార్య మనసాతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుండి భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య మనసా తన ఊరికి వెళ్లింది. ఆమెను గ్రామానికి రావాలని కోరినప్పుడు నవీన్ మనస్తాపానికి గురై, గ్రామానికి రాకుండా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి మృతదేహంపై పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, స్థానికులు మరియు కుటుంబ సభ్యులు భార్య మనసా తరచూ నవీన్‌ను వేధించేదని ఆరోపిస్తూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
