DSports Jan05 2026: రాయుడు ఈ సంతోషకరమైన వార్తను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తన భార్య, అప్పుడే పుట్టిన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “మాకు కొడుకు పుట్టాడు.. ఎంతో సంతోషంగా ఉంది” అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.

అంబటి రాయుడు, చెన్నుపల్లి విద్యలకు 2009లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు:మొదటి సంతానం 2020 జూలైలో పెద్ద కుమార్తె వివియా జన్మించింది.రెండో సంతానం 2023 మే నెలలో (ఐపీఎల్ సీజన్ సమయంలో) రెండో కూతురు పుట్టింది.మూడో సంతానం 2026 జనవరి 5న మగబిడ్డ జన్మించడంతో రాయుడు కుటుంబం పూర్తిస్థాయిలో సంబరాలు చేసుకుంటోంది.