DNews: 30 Dec: సైబరాబాద్ పోలీస్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజల భద్రత కోసం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలి. డ్రైవర్లు యూనిఫాం ధరించి, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలి. యాప్‌లో బుకింగ్‌ను తిరస్కరించినట్లయితే, వారికి ఈ-చలాన్ రూపంలో జరిమానా విధించబడుతుంది. ప్రయాణికులు బుకింగ్ రద్దు చేసిన సందర్భంలో వాహనం వివరాలు, సమయం, ప్రదేశం వంటి వివరాలను 9490617346 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని సూచించారు.
ప్రయాణికులతో డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించరాదు, అధిక చార్జీలు వసూలు చేయరాదు. బార్లు, పబ్‌లు, క్లబ్‌లలో మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా మేనేజర్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే కేసులు నమోదు చేయబడతాయి. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

రోడ్లపై తప్పు దిశలో డ్రైవింగ్, అనధికారిక పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం వంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు ప్రత్యేక సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ పరిధిలోని అన్ని రోడ్లపై మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారిపై ప్రత్యేక తనిఖీలు జరగనున్నాయి. ప్రజలు ఈ నియమాలను పాటించి సురక్షితంగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana