DET:DEC 30:
వ్యక్తిత్వ హక్కులంటే ఏమిటి?
సినీ సెలబ్రిటీలు క్రీడాకారులు లేదా ప్రముఖ వ్యక్తుల పేరు,గొంతు,ముఖం మరియు వారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఇతర అంశాలను వారి అనుమతి లేకుండా వాణిజ్య పరంగా వాడుకోకుండా ఉండే హక్కులనే పర్సనాలిటీ రైట్స్ అంటారు.ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల గొంతును రూపాన్ని మార్చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్న తరుణంలో ఈ హక్కులకు ప్రాముఖ్యత పెరిగింది.

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు:
తన అనుమతి లేకుండా తన పేరు,ఫోటోలు,సంతకం లేదా తనను పోలిన బొమ్మలను వ్యాపార ప్రకటనల్లో సోషల్ మీడియాలో వాడుతున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఎలాంటి అంశాలను వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇది ఎన్టీఆర్ అభిమానులకు మరియు సినీ వర్గాలకు పెద్ద ఊరటనిచ్చింది.

ఎన్టీఆర్ స్పందన మరియు కృతజ్ఞతలు:
కోర్టు తీర్పు పట్ల తారక్ సంతోషం వ్యక్తం చేశారు.ఒక నటుడికి తన ప్రతిష్టే ఆస్తి అని దానిని కాపాడుకునే హక్కు అందరికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.సరైన సమయంలో న్యాయం చేసినందుకు ఢిల్లీ హైకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తన కోసమే కాకుండా భవిష్యత్తులో ఇతర కళాకారులకు కూడా ఈ తీర్పు ఒక రక్షణ కవచంలా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇతర నటులకు మార్గదర్శకం:

ఇంతకుముందు అమితాబ్ బచ్చన్,రజనీకాంత్,అనిల్ కపూర్ వంటి దిగ్గజ నటులు కూడా ఇలాంటి హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు.ఇప్పుడు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఈ అడుగు వేయడం విశేషం.దీనివల్ల సోషల్ మీడియాలో వచ్చే డీప్‌ఫేక్ వీడియోలు తప్పుడు యాడ్స్ మరియు అభిమానుల పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana