DET:DEC 30:
కన్నడ,తమిళ బుల్లితెర నటి నందిని సి.ఎం 26 బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఘటన వివరాలు:
ప్రముఖ టీవీ నటి నందిని సి.ఎం బెంగళూరులోని కెంగేరి ప్రాంతంలో ఉన్న తన పేయింగ్ గెస్ట్ గదిలో విగతజీవిగా కనిపించారు.సోమవారం ఆమె తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.నందిని ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు పీజీ మేనేజర్‌కు సమాచారం అందించగా తలుపులు పగులగొట్టి చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆత్మహత్యకు గల కారణాలు:

పోలీసులు ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఆ నోట్‌లో నందిని తన మనసులోని బాధను వ్యక్తం చేశారు.తన తండ్రి మరణం తర్వాత ప్రభుత్వం ఆమెకు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ ఆమెకు నటనపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని నిరాకరించారు.అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను నటనా రంగం వదిలి స్థిరపడాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.నటనలో సరైన గుర్తింపు రావడం లేదని తన బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని ఆమె ఆవేదన చెందినట్లు తెలుస్తోంది.

కెరీర్ నేపథ్యం:

నందిని కన్నడ మరియు తమిళ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కన్నడ సీరియల్స్ జీవ హూవాగిదే, సంఘర్ష,మధుమగలు,నీనాదె నా వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించారు.తమిళ సీరియల్స్ ప్రస్తుతం ఆమె గౌరి అనే తమిళ సీరియల్‌లో కనక మరియు దుర్గ అనే ద్విపాత్రాభినయం చేస్తున్నారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్‌లో ఆమె పాత్ర విషం తాగి చనిపోయే సీన్ ఇటీవలె చిత్రీకరించారు.ఆ సీన్ ప్రసారమైన కొన్ని రోజులకే ఆమె నిజ జీవితంలో ప్రాణాలు తీసుకోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల దర్యాప్తు:
కెంగేరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఒత్తిడితో పాటు మరేవైనా ఆర్థిక లేదా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.26 ఏళ్ల వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల సహనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana