DSports Dec24 2025:జైపూర్/బెంగళూరు: టీమ్ ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడితే ఆ మజాయే వేరని నేటి మ్యాచ్‌లు నిరూపించాయి. బుధవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో ‘రో-కో’ జోడి తమ ఫామ్‌ను చాటుకుంటూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

  • హిట్‌మ్యాన్ విధ్వంసం62 బంతుల్లోనే సెంచరీ!జైపూర్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేశారు. కేవలం 62 బంతుల్లోనే రోహిత్ తన శతకాన్ని పూర్తి చేసుకున్నారు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు బాదిన రోహిత్, సిక్కిం బౌలర్లకు చుక్కలు చూపించారు. చివరికి 155 పరుగులు (94 బంతుల్లో, 18 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసి ఔటయ్యారు. రోహిత్ ధాటికి ముంబై జట్టు 237 పరుగుల లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా ఛేదించింది.