D Spiritual: Dec 24: ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని, సీఎంఎస్-03 ఉపగ్రహ నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉపగ్రహాన్ని భారత నౌకాదళం అవసరాల కోసం ఇస్రో అభివృద్ధి చేయగా, దీనిని ఎల్వీఎం3 (LVM3 – బాహుబలి రాకెట్) ద్వారా ప్రయోగించనున్నారు. ప్రయోగానికి ముందు దైవ ఆశీస్సులు పొందేందుకు ఈ పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్‌కు, రాకెట్ నమూనాకు మరియు ఇస్రో శాస్త్రవేత్తలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నారాయణన్‌ను పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తదుపరి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఇస్రో ఛైర్మన్ నారాయణన్, ఆదివారం జరగనున్న సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి ఇస్రో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని అత్యంత బరువైన బాహుబలి రాకెట్ అయిన ఎల్వీఎం3 ద్వారా ప్రయోగించనున్నట్లు తెలిపారు.

ఇది ఒక అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ కాగా, భారత నౌకాదళం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపకల్పన చేసినట్లు నారాయణన్ వివరించారు. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగనుందని, రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లేందుకు అన్ని సాంకేతిక ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana