
DSports Dec23 2025:గురుగ్రామ్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పుకోవాలని (రిటైర్మెంట్) తీవ్రంగా ఆలోచించినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఒక స్నాతకోత్సవ కార్యక్రమంలో రోహిత్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“2023 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత నేను పూర్తిగా నిరాశ చెందాను. అసలు ఏం జరిగిందో నమ్మలేకపోయాను. ఆ సమయంలో నాకు అసలు క్రికెట్ ఆడాలనిపించలేదు. ఈ ఆట నాలోని శక్తిని, ఉత్సాహాన్ని అంతా లాగేసుకున్నట్లు అనిపించింది. నాలో ఏమీ మిగలలేదనిపించింది. అందుకే ఆటకు గుడ్‌బై చెప్పేయాలని ఒకానొక దశలో నిర్ణయించుకున్నాను.”
