DSports Dec23 2025:ఇస్లామాబాద్: భారత్‌ను చిత్తు చేసి ఆసియా కప్‌ను ముద్దాడిన పాకిస్థాన్ అండర్-19 క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్ భారీ నజరానా ప్రకటించారు. సోమవారం ప్రధానమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఛాంపియన్‌గా నిలిచిన జట్టులోని ప్రతి ఆటగాడికి 1 కోటి పాకిస్థానీ రూపాయల (10 మిలియన్ PKR) నగదు బహుమతిని అందజేస్తున్నట్లు వెల్లడించారు.

15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు, అలాగే టీమ్ మేనేజ్‌మెంట్ మరియు కోచింగ్ స్టాఫ్‌కు కూడా తగిన నగదు బహుమతులను ప్రకటించారు.దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. సమీర్ మిన్హాస్ 172 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.”ఈ యువ జట్టు దేశం గర్వపడేలా చేసింది. మీ కృషి మరియు ప్రతిభకు ఇది తగిన గుర్తింపు” అని ప్రధాని షరీఫ్ ఈ సందర్భంగా కొనియాడారు.

ఎయిర్‌పోర్టులో జట్టుకు లభించిన స్వాగతం సీనియర్ జట్లకు లభించే దానికంటే ఘనంగా ఉండటం విశేషం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana