DNews:22 Dec: హైదరాబాద్‌ సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Ramakrishna Rao ఆదేశించారు. నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జనవరి 13 నుంచి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఫెస్టివల్ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా నిర్వహించే కైట్ ఫెస్టివల్స్‌ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌, శాంతిభద్రతలు, విద్యుత్‌, వైద్య సేవలు వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది పరేడ్ గ్రౌండ్‌తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ వేడుకలు జరుగుతుంటాయి. దేశవిదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్లు కూడా ఇందులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. విభిన్న ఆకృతుల్లో ఉన్న గాలిపటాలను ఎగురవేస్తూ నగరం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది.

హైదరాబాదీలు ఈ కైట్ ఫెస్టివల్‌ను ప్రత్యేకంగా ఆస్వాదిస్తారు. డీజే శబ్దాలతో శిబిరాలు, మూడు రోజుల పాటు రంగురంగుల గాలిపటాలతో ఆకాశం నిండిపోతుంది. జనవరి 13 నుంచి ఫెస్టివల్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడంతో, ఈసారి కూడా వేడుకలు మరింత ఘనంగా జరగనున్నాయని నగరవాసులు ఇప్పటికే సంబరాలకు సిద్ధమవుతున్నారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana