
DNews Dec22 2025: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫుట్‌బాల్ రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించగా, దానికి మంత్రి సీతక్క తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సోమవారం (డిసెంబర్ 22, 2025) మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“రేవంత్ రెడ్డి ఎవరితో ఫుట్‌బాల్ ఆడాలో కేటీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రపంచ స్థాయి ఆటగాడితో (మెస్సీతో) ఫుట్‌బాల్ ఆడి తన సత్తా చాటారు. ఇక కేటీఆర్‌తో ఫుట్‌బాల్ ఎలా ఆడాలో, ఆయనను ఎలా ఎదుర్కోవాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసు” అని సీతక్క చమత్కరించారు.
