
DNews Dec22 2025: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తూ, ఆయనను “వెన్నుపోటుకు మారుపేరు” అని అభివర్ణించారు. తాజాగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
వెన్నుపోటు రాజకీయాలు: “రేవంత్ రెడ్డికి ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి లేవు. ఆయన ఏ పార్టీలో పుట్టారో, ఏ పార్టీలో పెరిగారో, రేపు ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికీ తెలియదు. త్యాగాల చరిత్ర మాది అయితే.. వెన్నుపోటు పొడిచే చరిత్ర రేవంత్ ది” అని హరీష్ రావు మండిపడ్డారు.
