DNews Dec22 2025: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. నేడు (డిసెంబర్ 22, 2025) సచివాలయంలో జరిగే కీలకమైన క్యాబినెట్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కేసీఆర్ విమర్శలకు కౌంటర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. “ఇప్పటిదాకా ఒక లెక్క.. రేపటి నుంచి మరో లెక్క” అంటూ కేసీఆర్ చేసిన హెచ్చరికలపై మంత్రులతో చర్చించి గట్టి సమాధానం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు.అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. కేసీఆర్ లేవనెత్తిన సాగునీటి ప్రాజెక్టులు, అప్పుల అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికలు ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు, త్వరలో జరగబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

అభివృద్ధి పనులు మూసీ పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ మరియు 22 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పురోగతిపై సమీక్ష జరపనున్నారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana