DSports Dec20 2025:ముంబై: భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు ప్రకటన వచ్చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం మధ్యాహ్నం 15 మంది సభ్యులతో కూడిన ధీటైన జట్టును వెల్లడించింది. అయితే, ఈ ఎంపికలో ఒక సంచలన నిర్ణయం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టారు.

గిల్ వైదొలగడంతో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సెలెక్టర్లు అనూహ్యంగా వైస్ కెప్టెన్‌గా నియమించారు. హార్దిక్ పాండ్యా పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, జట్టు కూర్పు దృష్ట్యా అక్షర్‌కే ఈ బాధ్యతలు అప్పగించారు. అలాగే, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం గమనార్హం.