
DSports Dec20 2025:ముంబై: ఉదర సంబంధిత సమస్య (Acute Gastroenteritis) కారణంగా గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చారు. తాను వేగంగా కోలుకుంటున్నానని, త్వరలోనే మళ్ళీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు.
తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానుల కోసం జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు.
