
DSports Dec20 2025: యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెడుతోంది. శనివారం జరిగిన నాలుగో రోజు ఆటలో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 349 పరుగులకు ముగించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని ఇంగ్లండ్ ముందు 435 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
సిరీస్‌లో ఇప్పటికే 2-0తో వెనుకంజలో ఉన్న ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత కీలకం. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలిస్తే, మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది
