DSports Dec19 2025 : అంతకుముందు, ఓవర్‌నైట్ స్కోరు 213/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు (371)కి దీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (83) తన కెరీర్‌లో అత్యంత నిదానమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా జోఫ్రా ఆర్చర్ (51) తన తొలి టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 106 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్, ప్యాట్ కమిన్స్ తలా 3 వికెట్లు తీశారు.
85 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (1) త్వరగానే అవుట్ అయినప్పటికీ, లోకల్ హీరో ట్రావిస్ హెడ్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన హోమ్ గ్రౌండ్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ హెడ్ 142 పరుగులతో (నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఇది అతనికి అడిలైడ్ ఓవల్‌లో వరుసగా నాలుగో టెస్ట్ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు అలెక్స్ క్యారీ (52 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు విడదీయని 122 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్న ఆసీస్, నాలుగో రోజు ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana