
DET:DEC 19:
నిక్ జోనాస్ స్టెప్పులు – సోషల్ మీడియాలో హల్చల్:
గ్లోబల్ స్టార్ నిక్ జోనాస్ ఇటీవల బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ పాటకు డాన్స్ చేస్తూ కనిపించారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విదేశీయుడైనా సరే మన దేశీ మ్యూజిక్కు ఆయన వేసిన స్టెప్పులు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.నిక్ జోనాస్ తనదైన శైలిలో ఈ పాటకు జోష్‌ను జోడించడం విశేషం.
రణవీర్ సింగ్ ఎనర్జీ నిక్ జోనాస్ స్టైల్:
రణవీర్ సింగ్ పాటలు అంటేనే ఎంతో ఎనర్జీతో నిండి ఉంటాయి.ధురంధర్ ట్రాక్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అటువంటి ఫాస్ట్ బీట్ ఉన్న పాటకు నిక్ జోనాస్ ఎంతో ఈజ్‌తో డాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ప్రియాంక చోప్రా భర్తగా ఇప్పటికే భారతీయులకు దగ్గరైన నిక్,ఈ వీడియోతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు.ఆయన డాన్స్‌లో ఉన్న ఆనందం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
మన నేషనల్ జీజూ అంటూ నెటిజన్ల కామెంట్స్:
ఈ వీడియో చూసిన నెటిజన్లు నిక్ జోనాస్‌ను రకరకాలుగా కొనియాడుతున్నారు.ముఖ్యంగా ఆయనను నేషనల్ జీజూ అని పిలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నిక్ భారత్ పట్ల,ఇక్కడి సంస్కృతి పట్ల ఎంతో గౌరవాన్ని చూపిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయనను మన ఇంట్లోని వ్యక్తిలా భావిస్తూ సోషల్ మీడియాలో ఈ బిరుదును ఖరారు చేసేశారు.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో:
ఈ క్రేజీ వీడియోను వేల సంఖ్యలో షేర్ చేస్తున్నారు.కేవలం నిక్ అభిమానులే కాకుండా,రణవీర్ సింగ్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు.హాలీవుడ్ మరియు బాలీవుడ్ కలయిక ఇలా ఉంటే చూడటానికి చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.మొత్తం మీద నిక్ జోనాస్ మరోసారి ఇండియన్ ఆడియన్స్‌ను తన డాన్స్‌తో మాయ చేసేశారు.
