
DSports Dec19 2025 :అడిలైడ్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే తొలి రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్, మూడో టెస్టులోనూ పట్టు బిగించింది. అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 286 పరుగులకే పరిమితం కాగా, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో 356 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన 371 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్, ఆసీస్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ బెన్ స్టోక్స్ (83), లోయర్ ఆర్డర్లో జోఫ్రా ఆర్చర్ (51) విరోచితంగా పోరాడారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 106 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది.ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ తలా మూడు వికెట్లతో చెలరేగగా, స్పిన్ దిగ్గజం నాథన్ లయన్ 2 వికెట్లు తీశారు. ఈ క్రమంలో లయన్, పేస్ లెజెండ్ మెక్‌గ్రాత్‌ను అధిగమించి ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు.
