
DET:DEC 18:
ఓటీటీలో ఎక్కడ చూడాలి?
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.తాజా సమాచారం ప్రకారం,డిసెంబర్ 18 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో చూడలేకపోయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఈ ప్లాట్ఫామ్లో సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
కథా నేపథ్యం ఏమిటి?
తెలంగాణలోని మనుకోట ఇల్లందు పరిసర ప్రాంతాల్లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా దర్శకుడు సాయిలు కాంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఒక బ్యాండ్ మేళం నడిపే రాజు,కాలేజీకి వెళ్లే రాంబాయ్ మధ్య పుట్టిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది.అయితే వీరి ప్రేమకు అమ్మాయి తండ్రి అడ్డుపడతాడు.ఒక సామాన్యమైన వ్యక్తికి తన కూతురిని ఇవ్వడానికి ఇష్టపడని తండ్రి వల్ల ఆ ప్రేమికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు?చివరికి వారి ప్రేమ గెలిచిందా లేదా?అనేదే ఈ సినిమా కథ.
ఓటీటీలో స్పెషల్ ఏమిటి?
సాధారణంగా థియేటర్లలో విడుదలైన వెర్షన్ కంటే ఓటీటీలో వచ్చే వెర్షన్ కొంచెం భిన్నంగా ఉండబోతోంది.రాజు వెడ్స్ రాంబాయ్ ఎక్స్టెండెడ్ కట్ పేరుతో అదనపు సీన్లతో స్ట్రీమింగ్ అవుతోంది.థియేటర్లలో కట్ చేసిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం ఉంది.అంతేకాకుండా ఈ సినిమా 4K క్వాలిటీతో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో అందుబాటులో ఉంది.
సినిమా ప్రత్యేకతలు:
కేవలం 2.5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.గ్రామీణ వాతావరణం అక్కడి మనుషుల ఎమోషన్స్,మరియు గుండెను హత్తుకునే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం.మంచు మనోజ్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.
