DSports Dec17 2025: రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరున్న పప్పు యాదవ్ కుమారుడు సార్థక్ రంజన్, ఇప్పుడు ఐపీఎల్ వేదికగా తన క్రికెట్ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సార్థక్, ఈసారి మినీ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సార్థక్ రంజన్‌ను ఆయన కనీస ధర (Base Price) అయిన రూ. 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతర జట్లు పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ, లక్నో యాజమాన్యం ఆయనలోని బ్యాటింగ్ ప్రతిభను గుర్తించి జట్టులోకి తీసుకుంది.